సాఫ్ట్వేర్ సీతారాం సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య రేణుక, ఆమె ప్రియుడు రమణతో పాటు శ్రవణ్‌ను అరెస్ట్ చేశారు. భార్య రేణుక ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఫిబ్రవరిలో సీతారాం.. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.