మెక్సికోకు చెందిన 23 ఏళ్ల వలేరియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఆమె గ్వాడలజారాలో బ్యూటీ సెలూన్లో టిక్ టాక్‌లో తన ఫాలోవర్స్‌తో మాట్లాడేందుకు లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించింది. అందరికీ హాయ్ చెప్పింది. ఇంతలో ఆమె శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. లైవ్‌స్ట్రీమింగ్ జరుగుతుండగానే మరణించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.