SRCL: వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్ (26) అనే యువ గొర్లకాపారి మంగళవారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామ శివారులో జరిగింది. లక్ష్మణ్ తలపైన పిడుగు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.