అన్నమయ్య: పీలేరు సదుం రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడడంతో కర్ణాటకకు చెందిన వ్యక్తులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.