TG: హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్ను కారుతో ఢీకొట్టి డ్రైవర్ పరారయ్యాడు. ఈ క్రమంలో ఒకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్ను స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.