TG: మీర్‌చౌక్ అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ ఇంజిన్లు సమయానికి రాకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫైర్ ఇంజిన్లలో ఆక్సిజన్ అందుబాటులో లేదన్నారు. అదేవిధంగా ప్రమాద తీవ్రతను అధికారులు అంచనా వేయలేదని విమర్శించారు. కాగా, ఈ ఘటనలో నాలుగు కుటుంబాలకు చెందిన వారు చనిపోయారు. వారంతా ఉమ్మడి కుటుంబసభ్యులుగా తెలుస్తోంది.