KKD: తొండంగి మండలం రావికంపాడు వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం చెందాడు. మృతుడు ఎల్లయ్యపేట పంచాయతీ ఉద్యోగి ఎస్.సత్య వెంకటేష్ (30) గా గుర్తించారు. మృతుడు తన స్వగ్రామమైన అన్నవరం నుంచి వ్యక్తిగత పనులపై కత్తిపూడి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.