ప్రకాశం: చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని నుంచి ఒంగోలుకు వస్తున్న ఆర్టీసీ బస్సును గ్రానైట్ లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.