విశాఖ రైల్వేస్టేషన్ పరిసరాల్లో మత్తుకు బానిసలైన వ్యక్తులు ప్రయాణికులపై దాడులకు పాల్పడుతున్నారు. ఆదివారం సాయంత్రం ఒక ప్రయాణికుడి వద్ద నగదు, సెల్ ఫోన్ లాక్కున్న నలుగురిలో ఇద్దరిని తోటి ఆటోడ్రైవర్లు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రైల్వేస్టేషన్ పరిసరాల్లో పోలీసుల నిఘా లేకపోవడమే దీనికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.