TG: రేవంత్ రెడ్డి ఓఎస్డీ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ క్రికెటర్ నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం ఓఎస్డీ పేరుతో ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసి పలువురు హై ప్రొఫైల్ వ్యక్తులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో కూడా నాగరాజుపై కేసులు ఉన్నాయి.