»19 Year Old Passed Away With Heart Attack In Anantapur
Heart Attack: 19 ఏళ్లకే గుండెపోటుతో మరో యువకుడు మృతి
యువతలో గుండెపోటు(Heart Attack) ఘటనలు గుబులు పుట్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు(Heart Attack)కు గురై మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఓ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. అతి చిన్న వయసులో 19 ఏళ్లకే ఆ యువకుడికి గుండెపోటు(Heart Attack) వచ్చింది. స్నేహితులతో ఆడుతూ ఉండగానే ఆ యువకుడికి గుండెపోటు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో తనూజ నాయక్(Tanooja Naik) అనే 19 ఏళ్ల యువకుడికి గుండెపోటు(Heart Attack) రావడం కలకలం రేపుతోంది. జిల్లాలోని మడకశిర మండలం అచ్చంపల్లి తాండాకు చెందిన తనూజ నాయక్ పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నాడు. తాజాగా తనూజ నాయక్(Tanooja Naik) తన ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ గ్రౌండ్ లో కబడ్డీ ఆడుతుండగా ఒక వైపు వెళ్తూ వెళ్తూ కుప్పకూలిపోయాడు.
తనూజ నాయక్(Tanooja Naik) అలా ఎందుకు పడ్డాడో మొదట ఫ్రెండ్స్ కు అర్థం కాలేదు. వెంటనే అతడ్ని తీసుకుని ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ ప్రథమ చికిత్స చేశాడు. ఆ తర్వాత తనూజ నాయక్ ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. బెంగుళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనూజ నాయక్(Tanooja Naik) ప్రాణాలు విడిచాడు.
19 ఏళ్ల వయసులోనే గుండెపోటు(Heart Attack)కు గురై తనూజ నాయక్(Tanooja Naik) చనిపోయవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం తనూజ నాయక్ కబడ్డీ ఆడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుండెపోటు(Heart Attack) మరణాలు ఈమధ్యకాలంలో యువతలోనే ఎక్కువగా సంభవిస్తున్నాయి. దీనిపై వైద్యులు కూడా జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడటం, ఒత్తిడి, టెన్షన్స్ వల్లే ఈ గుండెపోటు(Heart Attack) ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.