తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వచ్చాయి. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. రాష్ట్రంలోని 64స్థానాల్లో మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. కాగా నేడు రాజీనామాల పర్వం మొదలైంది.
ఇటీవల గోవాలో దక్షిణాది అవార్డుల వేడక జరిగింది. ఇందులో కన్నడ నటీనటులకు అవమానించేలా వ్యవహరించారని, నిర్వాహకులు అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేదని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టగా దుమారం రేపింది. తెలుగు చిత్ర పరిశ్రమే వాళ్లను అవమానించిందని అన్న
సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాకు సోమవారం పెద్ద ఊరట లభించింది. అతని సస్పెన్షన్ రద్దు చేయబడింది. ఈ విషయాన్ని స్వయంగా రాఘవ్ చద్దా తెలిపారు.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ విరుచుకుపడుతోంది. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ తరుణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర నెంబర్లను ప్రభుత్వం ప్రకటించింది. కుండపోత వర్షాల వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
అమిగోస్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ఆషికా రంగనాథ్ ప్రస్తుతం నా సామిరంగ సినిమాలో నటిస్తోంది. అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
యానిమల్ మూవీలో విలన్‌గా చేసిన బాబీ డియోల్ ఎమోషనల్ అయ్యారు. మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసేందుకు థియేటర్‌కు వెళ్లారు. అక్కడ వారు బ్రహ్మారథం పట్టడంతో.. భావొద్వేగానికి గురయ్యారు.
సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని కాంగ్రెస్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు.
ప్రముఖ మ్యాగజైన్ డిసెంబర్ నెలకు ఔట్లుక్ బిజినెస్ రూపొందించిన 'ఛేంజర్ మేకర్స్-2023' జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం.