TPT: రేణిగుంట మండలం గొల్లపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పెద్ది శెట్టి శంకర్ భార్య లీలావతి మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నాయకులతో కలిసి శుక్రవారం గొల్లపల్లి చేరుకొని ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అంతిమయాత్రలో ఎమ్మెల్యే పాడే మోశారు.