»Retired Officials Resigning Who Are In Nominated Posts In Brs Government
Telangana: కాంగ్రెస్ గెలుపు.. తెలంగాణలో మొదలైన రాజీనామాల పర్వం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వచ్చాయి. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. రాష్ట్రంలోని 64స్థానాల్లో మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. కాగా నేడు రాజీనామాల పర్వం మొదలైంది.
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వచ్చాయి. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. రాష్ట్రంలోని 64స్థానాల్లో మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. కాగా నేడు రాజీనామాల పర్వం మొదలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో ఎన్నో ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంతో కలిసి ప్రయాణించిన పలువురు సీనియర్లు తమ తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ట్రాన్స్ కో అండ్ జెన్ కో సీఎండీగా ఇన్ని రోజులు పనిచేసిన దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2014 జూన్ 5న జెన్‌కామ్ సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్‌రావును అదే ఏడాది 25న ట్రాన్స్‌కో ఇన్చార్జిగా ప్రభుత్వం నియమించింది.
అయితే తొలుత ప్రభాకర్ రావును సీఎండీగా రెండేళ్ల పదవీ కాలానికి నియమించిన ప్రభుత్వం.. ఆ తర్వాత పదవీ కాలాన్ని పొడిగించింది.. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓటమితో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా.. ప్రభాకర్ రావు జెన్ కోకు మొత్తం 54 ఏళ్లుగా తన సేవలను అందించారు. మరోవైపు సాంస్కృతిక సలహాదారుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి కూడా తన పదవికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్ శాంతికుమారికి పంపారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు కూడా రాజీనామా చేశారు. గత కొన్నేళ్లుగా ఇంటెలిజెన్స్‌లో ఓఎస్డీ చేశారు. అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఐఏఎస్ లను బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులలో ఉంచింది. వీరి పని తీరుపై గతంలో రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉండడంతో వారంతా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.