Babu Mohan: బీజేపీ పార్టీకి మాజీ మంత్రి బాబూ మోహన్(Babu Mohan) రాజీనామా చేస్తున్నట్లు చేశారు. మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీలో తనపై నిందలు వేస్తున్నారు అని, దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు తన ఫోన్ లిఫ్ట్ చేయడు అని, పార్టీలో తనకు తగిన ప్రాధాన్యాత ఇవ్వడం లేదని తెలిపారు. తనకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని ఉందని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆయనకు టికెట్ ఇచ్చే సూచన కనిపించడం లేదని వెల్లడించారు.
వరంగల్ ఎంపీగా పోటీ చేయాలనేది ఆయన కోరిక అని ఎప్పటికైనా అక్కడి నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెడుతా అని బాబూ మోహన్ చెప్పారు. బీజేపీలో ఉంటే అది కష్టం అవుతుందని, పని చేసే వారికి పార్టీ తగిన గుర్తుంపు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచే తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని వెల్లడించారు. తన లాంటి వారు బీజేపీలో ఇమడలేరని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో పార్టీలో ఏమైనా చేరుతున్నారా అనే మీడియా ప్రశ్నకు ఇంకా ఏం ఆలోచించుకోలేదు అని సమాధానమిచ్చారు.