GDWL: కే.టి దొడ్డి మండలం పాగుంటలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఈ నెల 27న పాగుంటకు రానున్నట్లు కార్యకర్తలు పేర్కొన్నారు. జిల్లా కన్వీనర్ పోగుల రాజేష్ నేతృత్వంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు.