»Allu Aravind It Is Not Correct To Blame An Industry For What A Person Has Done
Allu Aravind: ఒక వ్యక్తి చేసిన పనికి.. వ్యవస్థను నిందించడం సరికాదు
ఇటీవల గోవాలో దక్షిణాది అవార్డుల వేడక జరిగింది. ఇందులో కన్నడ నటీనటులకు అవమానించేలా వ్యవహరించారని, నిర్వాహకులు అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేదని సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టగా దుమారం రేపింది. తెలుగు చిత్ర పరిశ్రమే వాళ్లను అవమానించిందని అన్నారు. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ తాజాగా స్పందించారు.
Allu Aravind: గోవా వేదికగా ఇటీవల దక్షిణాది అవార్డుల కార్యక్రమం జరిగింది. ఓ సంఘటన ప్రస్తుతం చిత్ర పరిశ్రమని హల్చల్ చేస్తుందనే విషయం తెలిసిందే. అవార్డుల కార్యక్రమం దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటుల సమక్షంలో జరిగింది. వేడుకలో తమని అవమానించారంటూ కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు అసహనం వ్యక్తం చేశారు. కన్నడ నటీనటులను అవమానించేలా వ్యవహరించారని, నిర్వాహకులు అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేదని సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమ చేసిందని.. మొత్తం చిత్రపరిశ్రమను తప్పుబడుతూ వాళ్లు చేసిన వ్యాఖ్యలు స్థానిక పత్రికల్లో వైరల్గా మారాయి. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ తాజాగా స్పందించారు.
It is with deep concern and disappointment that we need to address the distressing events that transpired at the #Santhosham#South#Indian Film Awards 2023 The award function that is organised by… pic.twitter.com/s0kXAKPmh1
అవార్డుల వేడుకలో ఇతర భాషల వాళ్లకి ఇబ్బందులు జరిగాయి. వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమను తప్పుబడుతున్నారు. వీటికి సంబంధించినవి పత్రికల్లో వచ్చాయి. ఆ వార్తలు చూసి నేను ఎంతో బాధపడ్డా. అతను ఏటా అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఏడాది గోవాలో నిర్వహించారు. కానీ ఫెయిల్ అయ్యాడు. ఒకరు చేసిన పనికి మొత్తం ఇండస్ట్రీని నిందించడం కరెక్ట్ కాదని అన్నారు. అతను మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు. అది అతని పర్సనల్ ఫెయిల్యూర్ అని అరవింద్ తెలిపారు. ఈ ఘటనపై నిర్వాహకుడు స్పందించి నటీనటులకు క్షమాపణ చెప్పారు. సమాచారలోపంతో ఇబ్బందులు వచ్చాయి. వేరే పరిశ్రమ వాళ్లను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని నిర్వహకుడు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.