»Naa Saami Ranga Glimpses Of The Impressive Naa Samiranga Heroine
Naa Saami Ranga: ఆకట్టుకున్న నా సామిరంగ హీరోయిన్ గ్లింప్స్
అమిగోస్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ఆషికా రంగనాథ్ ప్రస్తుతం నా సామిరంగ సినిమాలో నటిస్తోంది. అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
Naa Saami Ranga: అమిగోస్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది ఆషికా రంగనాథ్. కథ పరంగా తెలుగు ఆడియన్స్‌కు దగ్గర కాలేకపోయింది. కానీ అందం పరంగా మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. కన్నడలో నటించిన ఆషికా ప్రస్తుతం నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న నా సామిరంగ సినిమాలో హీరోయిన్గా మెరవనుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న మూవీలో వరలక్ష్మీ పాత్రలో కనిపించనుంది. ఆ పాత్రకు సంబంధించి చిత్ర బృందం గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాలో ఆషికా.. వరలక్ష్మీ పాత్రలో అందంగా కనిపిస్తోంది. అద్దంలో చూసుకుని తన అందానికి తానే మురిసిపోతుంది. హీరో చూడటం, అతనిని చూసి హీరోయిన్ సిగ్గుపడటం ఈ గ్లింప్స్‌లో చూపించారు. ఆషికా వరలక్ష్మీ పాత్రలో ఎంత చక్కగా ఒదిగిపోయిందో ఈ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది.
నా సామిరంగ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి ఎలాంటి బ్రేకులు లేకుండా చిత్రీకరణ జరుపుతున్నారు. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ గ్లింప్స్ వీడియోను నిన్న రాత్రి బిగ్ బాస్ షోలో చూపించారు.అధికారికంగా ఈరోజే విడుదల చేశారు. గ్లింప్స్ చూసిన తర్వాత నా సామిరంగ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.