యూపీఐ లావాదేవీలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేశారు. రూ.2 వేలు దాటిన లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారన్న వార్తలు నిజంకాదని తేల్చి చెప్పింది. తప్పుడు, ఆధారాలు లేని సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని కేంద్రం తెలిపింది.