అల్లూరి: గూడెం కొత్తవీధి మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ఆర్మీ నగర్ వద్ద భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ కారణంగా చాలాసేపటి వరకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీస్ సిబ్బంది, గ్రామ యువత శ్రమించి ఆ చెట్టును తొలగించారు. దీంతో ట్రాఫిక్ సమస్య తొలిగిపోయింది.