TG: అకాల వర్షంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. GHMC అధికారులను అప్రమత్తం చేశారు. కూలిన చెట్లను వెంటనే తొలగించాలని డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.