SRD: మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన నర్సమ్మ(55) అదృశ్యమైనట్లు ఎస్సై రాజేష్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఈనెల 16వ తేదీన సదాశివపేటకు వెళ్లిన నరసమ్మ ఇప్పటివరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల వద్ద విచారించగా ఆచూకీ తెలియాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.