శ్వేతపత్రాలు సభలో పెట్టడం ద్వారా ఏదో జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తుంది, అలా చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రభుత్వం గ్రహించడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ మమ్మల్ని గెలికి తిట్టించుకుంటుందన్ని పేర్కొన్నారు.
సలార్ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రతి గాథలో రాక్షసుడు అంటే సాగే లిరిక్స్ హత్తుకున్నాయి. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యాయి. ఈ పాట మూవీకి మరింత హైప్ తీసుకొచ్చింది.
కొత్త వేరియంట్ కలవరపెడుతున్న తరుణంలో ఓ వ్యక్తి కోవిడ్ లక్షణాలతో ఎంజీఎంలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. ఆ పేషెంట్‌ను వైద్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
వరదల నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వరద తగ్గే వరకు ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.
ఏపీలో వాలంటీర్ల జీతాన్ని జనవరి నెల నుంచి పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. సీఎం జగన్ పుట్టిన రోజు కానుకగా వాలంటీర్ల జీతాన్ని రూ.750లు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో మాట్లాడారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ అచ్చం తన తండ్రిలానే ఆడుతున్నారని, బ్యాటింగ్ స్టైల్ కూడా అలానే ఉందంటే నెట్టింట ఓ వీడియో ట్రెండ్ అవుతుంది.
గత కొన్ని రోజులుగా పార్లమెంట్లో సస్పెన్షన్ వేటు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 143 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షకు గురయ్యారు. ఈక్రమంలో విపక్ష ఎంపీలు ఖర్గే నేతృత్వంలో భారీ నిరసన చేపట్టారు.
వికారాబాద్‌లో తబ్లీఘీ జమాత్ మీటింగ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 2020లో కరోనా వ్యాప్తికి ఈ మీటింగ్ ప్రధాన కారణమని ఆరోపించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరుగుతుందా అని