SRD: మునిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆచార సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా గ్రామస్తులు మల్లికార్జున స్వామికి స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వైభవంగా కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో BRS రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, మాజీ MPTC వెంకటేశం, మాజీ సర్పంచ్ శంకర్, నాయకులు ఉన్నారు.