NLR: ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో ఈనెల 22వ తేదీన పలు రకాల హక్కులకు వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ డెకరేషన్ చేయుట,స్టేజ్, షామియానా ఏర్పాటు, తదితర వాటికి వేలంపాట నిర్వహిస్తారని తెలిపారు.