W.G: తాడేపల్లిగూడెం పట్టణం కడగట్ల జనత చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత శిబిరాన్ని విద్యావేత్త చలంచర్ల సుబ్బారావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని హితవు పలికారు. అనంతరం 92 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 22 మందికి కళ్లజోళ్లు అందజేశారు.