ELR: పోలవరం నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జనసేన పార్టీ నాయకులు ఆదివారం తెలిపారు. ఈనెల 22, 23 తేదీల్లో మంత్రి పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తారన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏలూరు చేరుకుని, ఆ రాత్రి ఏలూరులో బస చేస్తారని చెప్పారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామన్నారు.