NLR: ఉలవపాడు మండలం కరేడులోని ధర్మారెడ్డి సంఘంలో శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.