సలార్ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రతి గాథలో రాక్షసుడు అంటే సాగే లిరిక్స్ హత్తుకున్నాయి. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యాయి. ఈ పాట మూవీకి మరింత హైప్ తీసుకొచ్చింది.
Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ (Salaar) మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. థియేటర్లలో సినిమా చూసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడిన వేళ ప్రమోషన్లలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ప్రభాస్, పృథ్వీరాజ్, ప్రశాంత్ నీల్‌ను దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. తర్వాత ఓ ఫిల్మ్ క్రిటిక్ ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ వచ్చింది. మూవీ రేపే రిలీజ్ కానుండగా సెకండ్ సింగిల్‌ను ఈ రోజు విడుదల చేసింది.
ప్రతి గాథలో రాక్షసుడు అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో లిరిక్స్ (lyrics) ప్రతి ఒక్కరినీ కనెక్ట్ అవుతున్నాయి. ఆ పాటతో మూవీకి మరింత హైప్ వచ్చింది. పాటలో పిల్లలే రాగం అందుకుంటారు. సమయానికి అనుకూలంగా లిరిక్స్ ఉన్నాయి. సలార్ మూవీ పార్ట్-1లో డార్లింగ్ ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియారెడ్డి తదితరులు నటించారు. రవి బ్రసూర్ సంగీతం అందించారు.