ASR: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(యూఎఫ్ఎస్-2025)పక్కాగా చేపట్టాలని కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయం ఏవో బాలమురళికృష్ణ, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం మండలంలోని సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మంగళవారం నుంచి యూఎఫ్ఎస్ ప్రారంభమవుతుందని తెలిపారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరిగి వ్యక్తిగత, కుటుంబ వివరాలు మొబైల్ యాప్లో నమోదు చేయాలని సూచించారు.