»Good News For Them In Ap Salary Hike As Cms Birthday Gift
Andhrapradesh: ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. సీఎం బర్త్ డే గిఫ్ట్‌గా జీతం పెంపు!
ఏపీలో వాలంటీర్ల జీతాన్ని జనవరి నెల నుంచి పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. సీఎం జగన్ పుట్టిన రోజు కానుకగా వాలంటీర్ల జీతాన్ని రూ.750లు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. సీఎం బర్త్ డే గిఫ్ట్‌గా ప్రభుత్వం వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ప్రభుత్వం తరపున ఇంటింటికీ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీపికబురు చెప్పారు. జనవరి నెల నుంచి వాలంటీర్ల జీతాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు కానుకగా మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కారుమూరి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ బర్త్ డే (Cm Jagan Birth Day) కానుకగా వాలంటీర్ల జీతం అదనంగా రూ.750లు పెంచుతున్నట్లు వెల్లడించారు. పెంచిన జీతాన్ని వాలంటీర్లు వచ్చే నెల 1వ తేది నుంచి అందుకుంటారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కారుమూరి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకునేందుకు చూస్తున్నారన్నారు. అందుకే జగన్ పాలన పోవాలని చూస్తున్నట్లు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. ఏపీలో వైసీపీ పాలనను ప్రతిపక్ష నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేస్తారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.