SKLM: ఎచ్చెర్ల పాత జాతీయ రహదారిపై గురువారం చిన్నరావుపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ కనకయ్య తీవ్రంగా గాయపడ్డారు. పాత జాతీయ రహదారి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా శ్రీకాకుళం వైపు వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టింది. చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ కుమార్ పేర్కొన్నారు.