NLR: ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ M శ్రీనివాసరావు పదోన్నతిపై నెల్లూరు CSO ( కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్)గా బదిలీపై వెళ్తుండడంతో సిబ్బంది శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ.. DM గా బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలో కార్మికులు, డిపో అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఆత్మకూరు DM శివకేశవ్ యాదవ్‌ను ఉదయగిరి డిపో ఇంఛార్జ్‌గా నియమించారు.