YS Jagan Mohan Redy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుతూ.. సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలిపారు. అలాగే ఆంధ్రపదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రి జగన్‌కి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఎన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీవేంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
Birthday wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu. May he lead a long and healthy life.
సంక్షేమ సామ్రాట్ అయిన మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మంత్రి ఆర్కే రోజా సోషల్ మీడియా ద్వారా జగన్‌కు విషెష్ తెలిపారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె పేదలకు సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. శాంటా క్లాజ్ వేషంలో నిరుపేదల ఇంటికి వెళ్లి కానుకలు ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సీఎం జగన్‌కు జన్మదిన శూభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు మంత్రులు కూడా సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh on his Birthday. pic.twitter.com/75KTexNMbI
సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటుతున్నారు. పేదలు అన్నదానం చేస్తున్నారు. వస్త్రాలు పంపిణీ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పళ్లు అందిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.