»Corona Virus A New Variant Of Corona That Is Causing A Stir
Corona Virus: కలకలం రేపుతున్న కరోనా కొత్త వేరియంట్
దేశవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్తగా కేసులు నమోదు కావడం, కొవిడ్‌తో చనిపోవడంతో అందరిలో టెన్షన్ మొదలయ్యింది. ఇలాంటి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
Corona Virus: కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 పంజా విసురుతోంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కానీ మూడు రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా 21 కేసులు నమోదయినట్లు గుర్తించింది. అత్యధికంగా గోవాలో 19, కేరళ, మహారాష్ట్రలో ఒక్కోటి చొప్పున నమోదయ్యాయి. జేఎన్.1 వేరియంట్ వల్ల కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 614 కేసులు, అయిదు మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మే నెల తర్వాత అధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని పేర్కొంది.
కేరళలో మూడు, కర్ణాటకలో రెండు మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో ఓ వృద్ధుడు కరోనాతో మరణించడంతో ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది. ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్ల కొరత లేకుండా చూసుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా సోకితే వెంటనే హోం క్వారంటైన్లో ఉండమని తెలిపింది. అలాగే బయటకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరి అని తెలిపింది. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకొకసారి మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది.