»Bigg Boss Telugu Season 7 Contestant Amardeep Said Dont Come In My Family
Amardeep: నా కుటుంబం జోలికి రాకండి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పూర్తైన కూడా ఆ గొడవలు మాత్రం ఇంకా సద్దుమణగడం లేదు. ఈ సీజన్ పూర్తైన తర్వాత పలువురు అమర్ దీప్ కారు అద్దాలు ధ్వంసం చేయగా..ఈ ఘటనపై ఆయన తాజాగా స్పందించారు.
bigg boss telugu season 7 contestant Amardeep said don't come in my family
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ గెల్చిన తర్వాత గందరగోళంగా తయారైంది. పలువురు వ్యక్తులు ఇదే సీజన్లో రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో కారులో అమర్ తోపాటు ఆమె అమ్మ, భార్య కూడా ఉన్నారు. దీంతోపాటు కొన్ని ఆర్టీసీ బస్సులు అద్దాలు కూడా పగులగొట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే పల్లవి ప్రశాంత్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ సహా పలువురిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో అమర్ దీప్ తనపై జరిగిన దాడి అంశంపై మొదటి సారి స్పందించారు.
ఈ క్రమంలో అమర్ దీప్ మాట్లాడారు. తెలుగు ప్రజలందరికీ పాదాభివందనాలు. తనను ఇప్పటి వరకు ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. నేను గెలవలేను అనుకునే క్రమంలోనే ఇక్కడి వరకు తీసుకొచ్చారని గుర్తు చేశారు. కానీ తన కారు అద్దాలు పగులగొట్టి బయటకు రారా చూస్కుందాం. నీ అంతు చుస్తానని పలువురు అన్నారని గుర్తు చేశారు. ఇది తనకు చాలా బాధ కలిగించిందని వెల్లడించారు. అంతేకాదు తాను ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవచ్చని అన్నారు. తనకు భయం లేదని, ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. మా ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య ఉన్నారు. వాళ్లు పక్కన ఉన్న సమయంలో కొంచెం జాగ్రత్తగా ప్రవర్తిస్తే బాగుండేదని అన్నారు. కారు అద్దాలు పగులగొట్టిన క్రమంలో అద్దం సీసాలు తన అమ్మ, భార్యకు తగిలాయని చెప్పారు.
ప్రస్తుతం వారికి ఏం జరగలేదు. కానీ ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి అని అన్నారు. తనపై కోపం ఉంటే తిట్టండి పడతాను. కామెంట్లు కూడా చేయండి చూస్తాను. కానీ తన కుటుంబం జోలికి మాత్రం రావొద్దని సూచించారు. తనకు ఆనందం లేకుండా చేశారని అమర్ దీప్ వాపోయారు. అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.