టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీలో హీరోయిన్స్ గా శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటిస్తున్నారు. సంక్రాంతి పండగకు ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాంగ్ షూట్ జరుగుతోంది. మహేష్ అండ్ శ్రీలీలపై ఈ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది.
ఆ వీడియోలో మహేష్, శ్రీలీల కలిసి మాస్ స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఈ లీక్ అయిన వీడియోలో మహేష్, శ్రీలీల డాన్స్ చూసిన అభిమానులు ఆ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడు చూద్దామా అనే ఆసక్తితో ఉన్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. మరి మూడో పాటగా ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా గుంటూరు కారం సినిమా షూటింగ్ సంబందించిన వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఫ్యాన్స్ విమర్శలపై నిర్మాత నాగవంశీ ఇటీవల సీరియస్ అవుతూ ఓ ట్వీట్ కూడా చేశారు. గుంటూరు కారం సినిమాని జనవరి 12వ తేదినే రిలీజ్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.