బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠగా సాగింది. కెప్టెన్సీ కోసం అర్జున్, అమర్ పోటీ పడ్డారు. శివాజీ- శోభ కలిసి తమ నిర్ణయాన్ని ఆలస్యంగా తెలుపడం.. అప్పటికే ఎపిసోడ్ పూర్తవడంతో కెప్టెన్ ఎవరనే అంశంపై క్లారిటీ రాలేదు.
BB7: బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ 7 చివరికి వచ్చేసింది. లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠ రేపింది. హౌస్‌లో ఉన్న అశ్విని, రతిక, అమర్ ఇప్పటివరకు కెప్టెన్ కాలేదు. కెప్టెన్ కావాలని అమర్ ఆశ పడ్డాడు. తనను కెప్టెన్ చేయాలని అడిగాడు. ఓ సందర్భంలో ఏడ్చేశాడు కూడా.. ఆ ప్రోమో షో కు మరింత హైప్ తీసుకొచ్చింది.
కెప్టెన్సీ టాస్క్‌లో (captaincy task) భాగంగా ఇద్దరు పేర్లను చెప్పాల్సి ఉంది. లాస్ట్‌లో కెప్టెన్ కోసం అమర్, అర్జున్ పోటీ పడ్డారు. జట్టుగా ఉన్న శోభ, శివాజీ ఏకాభిప్రాయానికి రావడానికి చాలా సమయం పట్టింది. శోభ.. అమర్ పేరు చెప్పగా.. శివాజీ అర్జున్ పేరు చెప్పాడు. ఇద్దరు కలిసి చాలా సమయం చేయడంతో.. బిగ్ బాస్ వారిని అడిగాడు. లాస్ట్ ఛాన్స్ అని చెప్పగా ఇద్దరు కలిసి అర్జున్ పేరు చెప్పారు. ఆ ప్రోమోలో అమర్ ఫోటో షూట్ అవుతోంది. అమర్ ఏడుస్తున్నాడు.
అప్పటికే ఎపిసోడ్ అవడం, కెప్టెన్ ఎవరనే విషయం తెలియలేదు. దీంతో ఆ టాస్క్ ఉందా..? లేదంటే క్యాన్సిల్ అయ్యిందా అనే అంశం తెలియలేదు. ఈ రోజు ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున చెబితే కానీ కెప్టెన్ ఉన్నాడా లేడా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే రతిక, అశ్విని ఎలిమినెట్ అయ్యే అవకాశం ఉంది. కాస్త తేడా ఓటు పర్సంటేజీతో అర్జున్ ఆరో స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది.