»Bandi Sanjay Angry Over Government Funding For Tablighi Jamaat Meetings In Vikarabad
Bandi Sanjay: తబ్లీఘీ జమాత్‌కు నిధుల మంజూరుపై బండి సంజయ్ ఫైర్
వికారాబాద్‌లో తబ్లీఘీ జమాత్ మీటింగ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 2020లో కరోనా వ్యాప్తికి ఈ మీటింగ్ ప్రధాన కారణమని ఆరోపించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరుగుతుందా అని ప్రశ్నించారు. వెంటనే ఈ మీటింగ్‌ను క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay angry over government funding for Tablighi Jamaat meetings in Vikarabad
Bandi Sanjay: జనవరిలో వికారాబాద్(Vikarabad)లో ఇస్లామిక్ సొసైటీ పేరిట తబ్లీఘీ జమాత్(Tablighi Jamaat) సమావేశం జరుగనుందని, దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందంటూ బీజేపీ(BJP) ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) మండిపడ్డారు. పరిగి మండలంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి రూ.2.45 కోట్లు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతోందా? రాష్ట్ర నిఘా విభాగం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇలాంటి మీటింగులు పెట్టి తెలంగాణను తుక్డే తుక్డే గ్యాంగ్ ఏం చేయాలనుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే తబ్లీఘీ జమాత్ కార్యక్రమానికి నిధులు ఎందుకు విడుదల చేశారన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వ ఆదేశాల తాలూకు ఫొటోను కూడా పంచుకున్నారు.
ఈ సంస్థ టెర్రరిజంను ప్రోత్సహిస్తుందని, అందుకోసమే సౌదీ అరేబియా, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, కజకస్థాన్ వంటి దేశాలు నిషేధించాయని బండి సంజయ్ పేర్కొన్నారు. 2020లో దేశంలో కరోనా వ్యాప్తికి ఈ సంస్థ నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమాలే ప్రధాన కారణమని ఆరోపించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ మీటింగుల ఏర్పాటు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. మతమార్పిడులకు కారణమవుతున్న ఈ సంస్థకు నిధులు ఇవ్వడం వెనుక మాస్టర్ మైండ్ ఎవరని ప్రశ్నించారు. తబ్లీఘీ జమాత్ మీటింగ్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు.
Pure evil and outrageous of Congress government in Telangana to fund Tablighi Jamaat meeting.
Does the newly elected government of Revanth Reddy know this? What are intelligence agencies doing? What do you want to do to Telangana with Tukde Tukde gang?