NLG: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు 80 శాతం పూర్తయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ఇవాళ నకిరేకల్‌లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆసుపత్రి పనులను ఆయన పరిశీలించారు.