కరోనా కొత్త వేరియంట్ దేశమంతా కలవరపెడుతన్న వేళ హైదరాబాద్లో కేసులు నమోదు అవడం అందరిలో వణుకు పుట్టిస్తుంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
753 new covid cases recorded india on december 23rd 2023
Corona Virus: కరోనా(Corona ) ఈ పేరు తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కరోనా పాండమిక్ చేసిన గాయాలు ఇంకా మరువకముందే సంవత్సరానికో కొత్త వేరియంట్ అందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. తాజాగా మరో వెేరియంట్ అందరినీ బెంబేలెత్తిస్తోంది. జేఎన్.1(JN.1) అనేది కరోనా కొత్త వేరియంట్. మన దేశంలో మొదటి సారిగా కేరళలో గుర్తించారు. క్రమంగా దేశమంతటా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 358 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా ఐదుగురు చనిపోయారు. అయితే వీటిలో మూడు మరణాలు కేరళలోనే సంభవించాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 6 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులన్ని ఒక్క హైదరాబాద్(Hyderabad)లోనే వెలుగుచూశాయి. ప్రస్తుతం 14 మంది కోవిడ్ చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఏపీలో కూడా కొత్త వేరియంట్ కేసులను గుర్తించినట్లు సమాచారం. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అన్ని ప్రాంతాలకు విస్తరించముందే వైరస్(Corona Virus)ను కట్టడి చేయాలని, ప్రజలందరూ మాస్కులు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.