four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితి దారుణంగా ఉందని అంసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(mallu bhatti vikramarka) పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో విద్యుత్ రంగం గురించి చర్చ జరిగిన క్రమంలో స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి కరెంట్ సరఫరా కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ఈ మేరకు శ్వేతపత్రాన్ని భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. ఆ క్రమంలో గత ప్రభుత్వం జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కంలకు రూ.81 వేల కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు గుర్తు చేశారు. దీంతోపాటు విద్యుత్ రంగం రూ.50 వేల కోట్లకుపైగా నష్టాల్లో ఉందని చెప్పారు. గత తొమ్మిదన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా అప్పుల పాలు చేసిందో మరోసారి గుర్తు చేశారు. అంతేకాదు ఈ అంశాల పట్ల ప్రజలు ఆలోచించాలని కోరారు. గత బీఆర్ఎస్ పాలనలో మొత్తం అనేక రంగాల్లో అప్పుల కుప్పులు చేసి పెట్టారని అన్నారు.