Nagasusila Nagarjuna in Nageswara Rao biopic would be good
Nagasusila: అక్కినేని నాగేశ్వరరావు(Nageswara Rao) కూతురు నాగ సుశీల(Nagasusila) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. నాగేశ్వర రావు బయోపిక్ తీయాలంటే కేవలం నాగార్జున (Nagarjuna) చేస్తేనే బాగుంటుందని తెలిపారు. “పెళ్లైన కొత్తలో నాన్నకి చాలా కోపంగా ఉండేవాడని అమ్మ చెబుతూ ఉండేది. మేము ఎప్పుడూ ఆయన కోపంగా ఉండటం చూడలేదు. ఎప్పుడూ సరదాగానే మాట్లాడుతూ ఉండేవారు” అని పేర్కొన్నారు. ” వేసవి సెలవుల్లో నాన్న సినిమాల షూటింగులకు వెళ్లేవాళ్లం. ఊటీలో ఎక్కువగా షూటింగ్స్ జరిగేవి. ఆయన సినిమాలు చాలా వరకూ పూర్తిగా చూడలేదు. ఎందుకంటే తెరపై ఆయనని ఎవరైనా కొడుతూ ఉంటే చూడలేకపోయేదాన్ని. బయట నాన్నను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకునేదాన్ని కాదు” అని తెలిపారు.
“అనారోగ్యం వల్ల అమ్మ వేటిపైనా పెద్దగా ఆసక్తి చూపించేది కాదు. నాన్న మాకంటే ఎక్కువ మనవళ్లతో చనువుగా ఉండేవారు. నాన్న బయోపిక్ గురించి ఇంతవరకూ ఎవరు మాట్లాడలేదు. ఒకవేళ తీస్తే ఆ పాత్రను నాగార్జున చేస్తేనే బాగుంటుందని వెల్లడించింది. ఓ సందర్భంలో నాగేశ్వర రావు బయోపిక్ గురించి టాపిక్ వచ్చినప్పుడు సినిమా తీయడం కన్నా బుక్ రాస్తే బాగుంటుందని నాగార్జున అన్నారు. భవిష్యత్తులో బయోపిక్ ఉంటుందో, నాగార్జున అన్నట్లు పుస్తకం రాస్తారో చూడాలి.