క్రౌడ్‌స్ట్రైక్ 'ఫాల్కన్ సెన్సార్' అప్డేట్ చేయడం వలనే మైక్రోసాఫ్ట్ విండోస్‌లో అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ సీఈఓ వెల్లడించారు. సమస్య ఏంటో కనుగొన్నామని, దాన్ని పరిష్కరించామని తెలిపారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్విహించే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానం అందింది. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయను శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జులై 19న భారతీయ స్టాక్ మార్కెట్ ఆల్‌రౌండ్‌లో అమ్మకాలను చవిచూసింది. దీంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఒక శాతం చొప్పున పడిపోయాయి. వచ్చే వారం కేంద్ర బడ్జెట్‌కు ముందు పెట్టుబడిదారులు అన్ని రంగాలలో లాభాలను నమోదు చేసుకున్నారు .
గత కొద్ది రోజులుగా ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పై వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విచారణ చేపట్టగా ఆమె పెద్ద మోసానికి పాల్పడినట్లు తెలిసింది.
ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మార్గ మధ్యంలోనే దాన్ని రష్యాలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీలంకతో త్వరలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు వెళ్లనున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు ... సంజూ శాంసన్, అభిషేక్ శర్మలను పక్కన పెట్టారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశా
డ్రగ్స్ సరఫరా నియంత్రణ కోసం కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఒక్కగ్రాము డ్రగ్స్‌ని కూడా దేశంలోకి రానిచ్చేది లేదని తెలిపారు. ఈ విషయాలపై ఆయన ఏం మాట్లాడారంటే?
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కుల్తాలీకి చెందిన వ్యాపారవేత్తపై దాడి కేసులో ప్రధాన నిందితుడు సద్దాం సర్దార్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.
జో బైడెన్‌కు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకోవాలంటూ ఒత్తిడులు ఎక్కువ అవుతున్నాయి. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ని నిలబెట్టాలని డెమాక్రాట్లు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ విషయంలో బైడెన్ కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.