• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అవుకుమెట్టలో ఇళ్ల స్థలాల పరిశీలించిన మంత్రి

NDL: బనగానపల్లె నియోజకవర్గం అవుకుమెట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం నిర్ణయించిన భూములను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. భూమి చదును, జంగిల్ క్లియరెన్స్ పనులను పర్యవేక్షించిన ఆయన, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా చదును చేయాలని ఆదేశించారు.

April 13, 2026 / 08:25 AM IST

రేపు డీజేలకు నో పర్మిషన్: సీఐ

ELR: కలిదిండి మండలంలో ఈనెల 14న అంబేడ్కర్ జయంతి వేడుకల భద్రతపై సీఐ రవికుమార్ ఆదివారం రాత్రి ఉత్సవ కమిటీలతో సమావేశమయ్యారు. విగ్రహాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, కార్యక్రమాలకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలు జరుపుకోవాలని వెల్లడించారు.

April 13, 2026 / 08:19 AM IST

నేడు ఎమ్మెల్యే ఆనందరావు పర్యటన వివరాలు

కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి మధ్యాహ్నం 3 గంటలకు అమలాపురం పంచాయతీరాజ్ అతిధి గృహం నందు పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు అని తెలిపారు. కూటమి నాయకులు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.

April 13, 2026 / 08:15 AM IST

పొట్లూరులో వైభవంగా ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల

పల్నాడు: శావల్యాపురం మండలం పొట్లూరులోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆదివారం తిరుణాల వేడుకలను భక్తులు వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్ ప్రభలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

April 13, 2026 / 08:14 AM IST

నిబంధనలు పాటించకుంటే చర్యలు: ఎస్సై

W.G: నిబంధనలు పాటించడం బాధ్యత మాత్రమే కాదని, అది వాహనదారుల భద్రత కూడా అని నరసాపురం టౌన్ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి అన్నారు. ఆదివారం నరసాపురం పట్టణంలోని వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం, అతివేగం, మొబైల్ డ్రైవింగ్, నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు, జరిమానాలు తప్పవని ఎస్సై తెలిపారు.

April 13, 2026 / 08:13 AM IST

తెనాలి విద్యార్థుల కళా ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై కీర్తి

గుంటూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్‌లో తెనాలి ఎన్సీఆర్ఎం హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. 7, 8 తరగతుల విద్యార్థులు భావన, పార్ధు, జాస్మిన్, రామకృష్ణ, రమ్య చిత్రలేఖనంలో బంగారు, వెండి పతకాలు గెలుచుకున్నారు. వీరికి హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభపై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

April 13, 2026 / 08:11 AM IST

నరసరావుపేటలో ఉత్సాహంగా విగ్రహావిష్కరణ

PLD: నరసరావుపేట పట్టణం బరంపేటలో ఆదివారం శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహనరంగా విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు సామ్రాజ్య వైభవాన్ని చాటిన శ్రీకృష్ణదేవరాయలు స్ఫూర్తిదాయకుడని, ప్రజల కోసం పోరాడిన నేతగా వంగవీటి మోహనరంగా గుర్తుండిపోతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

April 13, 2026 / 08:06 AM IST

నేడు దువ్వూరులో గ్రామసభ: తహసీల్దార్

KDP: దువ్వూరు గ్రామ సచివాలయం-1లో ఇవాళ గ్రామ సభ ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ సంజీవ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని, రైతులందరూ గ్రామ సభకు హాజరుకావాలని ఆయన కోరారు. రీ సర్వే 5వ విడత బుధవారం నుంచి మొదలవుతుందని తహశీల్దార్ తెలిపారు.

April 13, 2026 / 08:03 AM IST

నగర ప్రజలకు పోలీసుల ముఖ్య గమనిక

ఎన్టీఆర్: ఇంట్లో పని చేసే పనిమనుషులను నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలు సేకరించడం అత్యంత అవసరమని సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు. ఇటీవల నగరంలో జరుగుతున్న చోరీలు, మోసాల నేపథ్యంలో ఈ సూచనలు చేసినట్లు తెలిపారు. పనిమనుషులను పని కోసం తీసుకునే ముందు వారి ఆధార్, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు.

April 13, 2026 / 08:03 AM IST

42మంది పై కేసులు నమోదు SP

పార్వతీపురం మన్యం జిల్లాలో పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 42 మందిపై కేసులు నమోదు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపైనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే రూ. 10 వేల జరిమానా, జైలు శిక్ష విధించబడుతుంది అన్నారు.

April 13, 2026 / 08:02 AM IST

‘అంబేద్కర్ జయంతిని మద్యపాన నిషేద దినంగా ప్రకటించాలి’

KKD: అంబేద్కర్ జయంతిని మద్యపాన నిషేధ దినంగా ప్రకటించాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, అంబేద్కర్ యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం సాయంత్రం గొల్లప్రోలు పట్టణంలోని ఎస్సీ పేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

April 13, 2026 / 07:55 AM IST

పేకాట నిర్వహిస్తున్న మహిళలు అరెస్ట్

ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారపు పేటలోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్న సమాచారంతో సీఐ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. రూ.10వేల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

April 13, 2026 / 07:53 AM IST

అగళి మండలంలో టీడీపీలోకి వలసల జోరు

సత్యసాయి: అగళి మండలం ఇరిగేపల్లి పంచాయతీ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి సమక్షంలో పంచాయతీ అధ్యక్షుడు ప్రకాష్ యాదవ్, గురులింగప్ప, లక్ష్మీకాంత, చిక్కన్న వైసీపీకి రాజీనామా చేసి పసుపు కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి డి.విశ్వనాధ్ యాదవ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

April 13, 2026 / 07:49 AM IST

ఈ నెల 21న దత్తికి చినజీయర్ స్వామి

VZM: దత్తి రాజేరు మండలంలోని దత్తి గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఈ నెల 21వ తేదీన చినజీయర్స్వామి వస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పెంకి తిరుపతినాయుడు ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఆరోజు ఉదయం ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని, భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

April 13, 2026 / 07:44 AM IST

నేడు పి గన్నవరంలో ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయ 11 గంటలకు నేదునురు సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పి గన్నవరం మండలం ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తారు.

April 13, 2026 / 07:42 AM IST