• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కస్తూర్బా జూనియర్ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

KDP: ప్రభుత్వం బాలికల ఉన్నత విద్య కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఆదివారం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా జూనియర్ కళాశాల భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల కోసం అన్ని వసతులతో కూడిన విద్యా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.

April 13, 2026 / 06:24 AM IST

ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నేటి పర్యటన వివరాలు

పల్నాడు: ‎ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సోమవారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది ఆదివారం విడుదల చేశారు. ఉదయం 10:00 గంటలకు సత్తెనపల్లిలో తాలూకా సెంటర్లో మంచినీటి చలివేంద్రాలు ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు రాజుపాలెంలో PM సూర్య ఘర్, సూర్య ఫలకాల గ్రిడ్ అనుసంధాన ప్రారంభోత్సవ కార్యక్రమoలో పాల్గొంటారు.

April 13, 2026 / 06:11 AM IST

‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు’

VZM: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్‌ సీఐ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్దానిక జమ్మూ, నారాయణపురం, పడాల పేట గ్రామాలలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను పట్టుకొని వారి నుంచి మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మద్యం సేవిస్తూ జీవితాలను పాడు చేసుకోవద్దని వారిని హెచ్చరించారు.

April 13, 2026 / 06:06 AM IST

పాఠశాల వార్షికోత్సవంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

ATP: అనంతపురం రాంనగర్‌లోని ఆల్ఫా బీటా యూకే కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. 

April 13, 2026 / 06:04 AM IST

రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

KKD: ఎలమంచిలి యార్డు సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు తుని రైల్వే ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతుడు పసుపు రంగు షర్టు, నలుపు జీన్ ప్యాంటు ధరించి ఉన్నారన్నారు. వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు

April 13, 2026 / 06:01 AM IST

తక్కెళ్లపాడులో వేజ్ సీకర్స్ మొబిలైజేషన్ సమావేశం

GNTR: ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామపంచాయతీలో ఆదివారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో వేజ్ సీకర్స్ మొబిలైజేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు. ఉపాధి హామీ పనుల్లో పాల్గొని గ్రామాన్ని సస్యశ్యామలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

April 12, 2026 / 10:07 PM IST

గురజాల డీఎస్పీగా మహేశ్వరరావు

PLD: గురజాల నూతన డీఎస్పీగా మల్ల మహేశ్వరరావు విధుల్లో చేరారు. ‎బదిలీలో భాగంగా విజయనగరం నుంచి గురజాలకు వచ్చారు. ఆదివారం గురజాల డీఎస్పీ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ‎పోలీసు శాఖలో తన అనుభవంతో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

April 12, 2026 / 10:04 PM IST

బొబ్బిలి కోటను సందర్శించిన ఎస్పీ దామోదర్

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ సాధారణ తనిఖీలలో భాగంగా ఆదివారం బొబ్బిలి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయన ఆహ్వానం మేరకు బొబ్బిలి కోటకు వచ్చి దర్బార్ మహల్‌ని సందర్శించారు. ఎమ్మెల్యే దగ్గరుండి బొబ్బిలి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను, చిత్రపటాలను చూపించి వాటి గురించి వివరించారు. అనంతరం బొబ్బిలి వీణను బహూకరించి సత్కారించారు.

April 12, 2026 / 10:00 PM IST

‘ఈ నెల 14 అగ్నిమాపక వారోత్సవాలు’

AKP: ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని నర్సీపట్నం అగ్నిమాపక శాఖాధికారి పీ. అప్పలస్వామి ఆదివారం తెలిపారు. మొదటి రోజు చనిపోయిన అమరవీరులకు నివాళి అర్పిస్తామన్నారు. మరుసటి రోజు నుంచి బస్టాండ్, పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు, అపార్టుమెంట్లు, గ్యాస్ గొడౌన్లు, పెట్రోల్ బంక్‌ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

April 12, 2026 / 10:00 PM IST

చెరువు మరమ్మతు పనులు పరిశీలించిన పరిటాల సునీత

ATP: కనగానపల్లి మండల కేంద్రంలోని రెడ్డివారికుంట చెరువు మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. 2024 భారీ వర్షాలకు తెగిపోయిన ఈ చెరువుకు రూ. 86 లక్షల డీఎంఎఫ్ నిధులు కేటాయించారు. గత నెల 17న పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం జరుగుతున్న తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు.

April 12, 2026 / 09:35 PM IST

ఎమ్మెల్యే సమక్షంలో జనసేనలోకి భారీ చేరికలు

VZM: డెంకాడ మండలం చింతలవలస పంచాయతీ జనసేన నాయకులు బూడి కృష్ణ రావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. రెల్లివలస పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. వీరికి భోగాపురంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నాగ మాధవి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

April 12, 2026 / 09:30 PM IST

పల్లెల అభివృద్ధికి ప్రభుత్వ కట్టుబడి ఉంది: కేంద్రమంత్రి

SKLM: పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం మండలం రాయపాడు పంచాయతీలో రూ .46 లక్షల NREGS నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 12, 2026 / 09:30 PM IST

లంకెలకురపాడులో పేకాటరాయుళ్లు అరెస్ట్

PLD: లంకెలకురపాడులో మొక్కజొన్న తోటలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,040 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

April 12, 2026 / 09:29 PM IST

రేపు కొవ్వూరులో బీజేపీ ర్యాలీ

E.G: బీజేపీ ఆధ్వర్యంలో మహిళల 33% రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా రేపు సోమవారం ఉదయం 9:30 గంటలకు కొవ్వూరులో పాదయాత్ర నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పేర్కొన్నారు. కొవ్వూరు బస్ స్టాండ్ సర్కిల్ నుంచి RDO కార్యాలయం వరకు జరిగే ర్యాలీని విజయవంతం చెయ్యాలని కోరారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశిధరాజు పాల్గొంటారని తెలిపారు.

April 12, 2026 / 09:18 PM IST

డివిజన్ వీఆర్వోల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

AKP: అడ్డురోడ్డు జంక్షన్ రెవిన్యూ డివిజన్ వీఆర్వోల సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఏర్పాటు అయింది. అధ్యక్షుడిగా కోటవురట్లకు పీ. రమేష్, ప్రధాన కార్యదర్శిగా ఎలమంచిలి మండలానికి చెందిన సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా నూకరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎల్లపు నాయుడు, కోశాధికారిగా రమణను ఎన్నుకున్నారు.

April 12, 2026 / 09:00 PM IST