GNTR: అగ్నిమాపక వారోత్సవాలు 4వ రోజు తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని వెస్ట్‌బెర్రీ స్కూల్‌తో పాటు రవి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గ్యాస్, ఎలక్ట్రికల్ ఫైర్లు, కేర్‌లెస్ స్మోకింగ్ ప్రమాదాలపై డెమోలు నిర్వహించారు. విద్యార్థులకు మాక్ డ్రిల్ ద్వారా అగ్నిప్రమాద నివారణపై అవగాహన కల్పించారు.
PLD: అమరావతి మండలంలోని దిడుగు గ్రామం నుంచి ఏటూరు వెళ్లే మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. ఈ విషయంపై ఏప్రిల్ 14న HIT TVలో కథనం ప్రచూరితమైంది. స్పందించిన అధికారులు పంచాయతీ అధికారుల సమక్షంలో రోడ్డు మధ్యలో తీసిన గండిని పూడ్చివేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా లంక భూముల్లో గండ్లు కొడితే చర్యలు తీసుకుంటామని MPDO హెచ్చరించారు.
AKP: రాష్ట్ర హోం మంత్రి అనిత ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు పాయకరావుపేట పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొత్తగా నిర్మించిన అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ శుక్రవారం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీహెచ్సీలో కొత్తగా నిర్మించిన అదనపు భవనాలను ప్రారంభిస్తారన్నారు.
VZM: మహిళా రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు.
PLD: ఉండవల్లి నివాసంలో TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి లోకేష్‌ను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దామని ఆకాంక్షించారు. లోకేష్‌తో మాట్లాడుతూ.. రాజకీయాలపై సర్చించారు.
కర్నూలు పర్యటనలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తులను ఇవాళ ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్ బి. కృష్ణమోహన్, కె. శ్రీనివాస రెడ్డి, ఎ. హరిహర నాథ శర్మలను పూలతో స్వాగతించారు. ఈ సందర్భంగా వారికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి పాల్గొన్నారు.
E.G: కోరుకొండ మండలం బూరుగుపూడిలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు, రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శుక్రవారం గ్రీవెన్స్ & పార్టీ క్యాడర్ సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం పార్టీకి మొదటి కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు.
BPT: ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాల మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీ-4 సిబ్బంది, నాయకులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 28 అర్జీలు అందగా, వీటిలో ఇంటి నిర్మాణం, స్థలాల కోసం 7, పింఛన్లకు సంబంధించిన 17, ఇతర సమస్యలపై 4 అర్జీలు స్వీకరించారు.
GNTR: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం పకడ్బందీగా నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సీ.యం.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
CTR: గుడిపాల పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 3.5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 లక్షల విలువ గల బియ్యంతో పాటు రూ.3 లక్షల విలువైన బొలెరో వాహనాన్ని కూడా పట్టుకున్నారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
KDP: ఒంటిమిట్ట సీఐగా పసుపుల వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలో ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, రైల్వే కోడూరు, చిట్వేలి, రాజంపేట ప్రాంతాల్లో ఎస్సైగా సేవలు అందించిన ఆయన, రైల్వే కోడూరు రూరల్ సీఐగా కూడా విధులు నిర్వహించారు. ఆయన అనుభవంతో ఒంటిమిట్ట ప్రాంతంలో చట్టవ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్ ఆవరణలో మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో ఇద్దరు నేతలు ఈ చారిత్రాత్మక నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో మూడు నెలల బ్యూటీషియన్ థెరపీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన మహిళలకు ఇవాళ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్బంగా క్యాంప్ కార్యాలయంలో మంత్రి సవిత 50 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని అన్నారు.
NTR: కూటమి ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి బాట పట్టాయని, పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో రూ.92 లక్షల నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను, డ్రెయిన్లను, గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
కోనసీమ: కాట్రేనికోన మండలం చెయ్యేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేబ్రేక్ అనిమల్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన శుద్ధి నీటి ప్లాంట్‌ను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన తాగునీరు అందించడం అత్యంత ముఖ్యమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తాయన్నారు.