• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘నార్కో టెర్రరిజం పట్ల అప్రమత్తంగా ఉండాలి’

KKD: నార్కో టెర్రరిజంపై సమాజం అప్రమత్తంగా ఉండాలని ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. శనివారం కాకినాడ సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో వైబ్రెంట్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో నిర్వహించిన దండి మార్చ్ 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ నిరోధానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలను వివరించి అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. 

April 19, 2026 / 08:56 AM IST

జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచనలు

నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రజలకు ఆదివారం పలు సూచనలు చేశారు. స్వీయ జనగణలో భాగంగా తన కుటుంబ వివరాలను ఆన్‌లైన్ నమోదు చేశారు. se.census.gov.in వెబ్‌సైట్‌లో 33 ప్రశ్నలకు ప్రజలంతా సమాధానం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

April 19, 2026 / 08:52 AM IST

అనంతపురంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

ATP: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ అనంతపురం టవర్ క్లాక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య దగ్గుపాటి మాట్లాడుతూ.. మహిళా బిల్లు విషయంలో కూటమి కుటిల రాజకీయాన్ని ప్రజల్లో ఎండగడతామని పేర్కొన్నారు.

April 19, 2026 / 08:40 AM IST

విద్యుత్ అంతరాయంపై స్పందించిన సిబ్బంది..!

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని పెంకుటిల్లు కాలనీలో ఇటీవల ఏర్పడిన విద్యుత్ సరఫరా అంతరాయంపై (ఏపీఈపీడీసీఎల్) వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిందని అసిస్టెంట్ ఇంజనీర్ తెలిపారు. సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ దృష్టికి వెళ్ళడంతో వెంటనే స్పందించిందని చెప్పారు. సమస్య ఏర్పడిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి చర్యలు చేపట్టామన్నారు.

April 19, 2026 / 08:36 AM IST

LRSకి చివరి అవకాశం.. వెంటనే అప్లై చేయండి: కమిషనర్

GNTR: అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కలిగిన వారు ఈ నెల 23వ తేదీలోపు LRS ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ సూచించారు. ఇది చివరి అవకాశమని, గడువు ముగిస్తే ప్లాట్ల క్రమబద్ధీకరణకు వీలుండదని హెచ్చరించారు. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతుల్లో చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వెంటనే రెగ్యులరైజ్ చేసుకోవాలని కోరారు. 

April 19, 2026 / 08:35 AM IST

రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించండి: MLA

PLD: పెదనందిపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గుడిపాడులో పర్యటించి, ప్రజల ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. వీటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అండగా ఉంటూ సమస్యలు తీర్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 

April 19, 2026 / 08:33 AM IST

ఉద్యోగులకు పదవీ విరమణ సర్వసాధారణం: ఎమ్మెల్యే

KRNL: కోసిగి MPP పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజమౌళి పదవి విరమణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తోటి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. క్రమశిక్షణ, బోధనా పద్ధతులు తోటి ఉపాధ్యాయులకు రాజమౌళి మార్గదర్శకమని కొనియాడారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

April 19, 2026 / 08:30 AM IST

జిల్లా జాయింట్ కలెక్టర్ బదిలీ

NDL: జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ బదిలీ అయ్యారు. ఆయనను ఏపీ సీఆర్డీఏ విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆ విభాగ బాధ్యతలను పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

April 19, 2026 / 08:29 AM IST

ప్రభుత్వ పాఠశాలలే ఉజ్వల భవిష్యత్తుకు పునాది: ఎమ్మెల్యే

ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనే నినాదంతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఉపాధ్యాయులతో కలిసి రాచర్లలో వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

April 19, 2026 / 08:28 AM IST

లారీ డ్రైవర్ పై దాడి.. కేసు నమోదు

NLR: రోడ్డుపై అడ్డుగా నిలిపిన బైక్‌ను పక్కకు తీయమన్నందుకు లారీ డ్రైవర్‌పై దాడి జరిగిన ఘటన శనివారం జరిగింది. కావలికి చెందిన ప్రభాకర్ పశువుల మేతను లారీలో తీసుకుని వెళ్తుండగా కసుమూరు రోడ్డులో బైక్ అడ్డంగా నిలిపి ఉండటాన్ని గమనించారు. దాన్ని పక్కకు తీయమని సూచించగా తిట్టి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు నమోదు చేశారు. 

April 19, 2026 / 08:27 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

W.G: ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. నరసాపురం నియోజకవర్గంలో 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.6,66,687 విలువైన CMRF చెక్కులను ఆయన శనివారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.

April 19, 2026 / 08:15 AM IST

హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించిన సీఐ

KKD: ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని కాకినాడ ట్రాఫిక్ వన్ టౌన్ సీఐ నూని రమేశ్ సూచించారు. శనివారం కాకినాడ మెయిన్ రోడ్డులో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. పోలీసులకు భయపడి హెల్మెట్ పెట్టుకోవడం కాదని ప్రాణాలు రక్షించుకోవడానికి హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాల విధిస్తామన్నారు

April 19, 2026 / 08:15 AM IST

వైభవంగా గజ్జ పూజ కార్యక్రమం

కడప: సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె పంచాయతీలోని ఆకురోపల్లె ఎస్సీ కాలనీలో శనివారం రాత్రి గజ్జ పూజ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. గజ్జ పూజ మహోత్సవ కార్యక్రమంలో కోలాటాల నృత్యాలు, తెలుగు సంప్రదాయం ఉట్టి పడేలా ప్రజలను ఆకట్టుకున్నాయి. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గజ్జ పూజ కార్యక్రమాన్ని తిలకించారు.

April 19, 2026 / 08:15 AM IST

ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే

E.G: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని టింబర్ యార్డ్ ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3.06 కోట్ల వ్యయంతో నిర్మించిన 1000 కిలో లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్‌ను శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు.

April 19, 2026 / 08:10 AM IST

‘నేను ప్రేమించా.. ఆమె మోసం చేసింది’

TPT: ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి కావడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తిరుపతి వెస్ట్ పోలీసుల వివరాల మేరకు.. గంగవరం(M) వేమనపల్లెకు చెందిన మహేంద్ర (20) బీకాం చదువుతూ వెంకటరమణ లే అవుట్‌లో ఉంటున్నాడు. అతను ఓ యువతిని ప్రేమించగా ఆమెకు వారం క్రితం పెళ్లైంది. దీంతో ‘నేను సూసైడ్ చేసుకుంటున్నా, నేను ఓ అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆమె మోసం చేసిందని ఈ ఘటనకు పాల్పడ్డాడు.

April 19, 2026 / 08:08 AM IST