• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ

అన్నమయ్య: రాయచోటిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని అర్బన్ సీఐ వెంకటా చలపతి ఇవాళ హెచ్చరించారు. రాయచోటి కొత్తపల్లిలో పోలీసు సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన ఆయన, యువత గంజాయి, సొల్యూషన్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న ప్రదేశాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 17, 2026 / 10:00 PM IST

మహిళల భద్రతపై అవగాహన సదస్సు

KRNL: కోడుమూరు కొండపేటలో మహిళల భద్రతపై ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. ‘మీ రక్షణ- మా బాధ్యత’ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మహిళలు భయపడకుండా సమస్యలను పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ ఉపేంద్రబాబు సూచించారు. సైబర్ నేరాలు, వేధింపులపై జాగ్రత్తలు తీసుకుని, శక్తి యాప్ వినియోగించాలని తెలిపారు.

April 17, 2026 / 10:00 PM IST

హిజ్రాలకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని హిజ్రాలకు అర్బన్ సీఐ సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో గౌరవంగా జీవించాలని సూచించారు. పట్టణంలో తిరుగుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని హెచ్చరించారు.

April 17, 2026 / 09:42 PM IST

శివాలయం భారీ విరాళం అందజేసిన శ్రీనివాసరావు

PLD: మాచవరం మండలం కొత్త గణేషన్ పాడు గ్రామానికి చెందిన కందుల శ్రీనివాసరావు దంపతులు కారంపొడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో చేపట్టిన శివాలయం నిర్మాణ పనులకు రూ. 43 లక్షల విరాళాన్ని దేవస్థాన కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కందుల శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.

April 17, 2026 / 09:37 PM IST

‘విమానాశ్రయంలో టాక్సీ డ్రైవర్లకి ఉపాధి కల్పించండి’

VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జిల్లా టాక్సీ డ్రైవర్లకి ఉపాధి కల్పించాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సాయంత్రం కె.ఎల్. పురం యూత్ హాస్టల్లో జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉపాధి అంశాలు సీరియస్‌గా తీసుకోకపోతే జిల్లా యువత నష్టపోతారని అన్నారు.

April 17, 2026 / 09:35 PM IST

‘నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి’

W.G: వేసవి నేపథ్యంలో గోదావరి తీరం వెంబడి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని నరసాపురం ఆర్డీవో దాసి రాజు ఆదేశించారు. ఈ సందర్భంగా RDO ఆచంట మండలం కోడేరులో పర్యటించారు. జల జీవన్ మిషన్ నిధులతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకం, బీఎస్ఎన్ఎల్ టవర్ నిర్మాణానికి సంబంధించిన స్థలాలను ఆయన పరిశీలించారు.

April 17, 2026 / 09:30 PM IST

అమర రాజా విద్యాలయం వార్షికోత్సవం వైభవంగా

TPT: తిరుపతి జిల్లా కరకంబాడిలోని అమర రాజా విద్యాలయంలో 30వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోగా, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. 

April 17, 2026 / 09:27 PM IST

తాళ్లపాక గంగమ్మ ఆలయంలో ఊంజల సేవ

తిరుపతి జిల్లా తాళ్లపాకలోని పెద్ద గంగమ్మ ఆలయంలో అమావాస్య పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, సాయంత్రం 7 గంటలకు కన్నుల పండువగా ఊంజల సేవ నిర్వహించారు. ఆలయ ఛైర్మన్, కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక శోభతో తాళ్లపాక పరిసరాలు సందడిగా మారాయి. 

April 17, 2026 / 09:02 PM IST

‘పోలీస్ సిబ్బంది సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం’

నంద్యాలలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఇవాళ ‘పోలీస్ గ్రీవియన్స్ డే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలు విని వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు మెడికల్ హెల్త్, రిక్వెస్ట్ బదిలీలు, ఇతర వ్యక్తిగత కారణాల గురించి ఎస్పీకి విన్నవించారు. పోలీసుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు.

April 17, 2026 / 09:01 PM IST

జిల్లా సిబ్బందితో ఎస్పీ సమీక్ష

ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ఇవాళ ఎస్పీ ప్రతాప్ కిషోర్ పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేరాల నియంత్రణ, ప్రజా భద్రత, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిర్మూలనపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారుల ఫిర్యాదులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. 

April 17, 2026 / 09:00 PM IST

రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: జేసీ

సత్యసాయి: జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు 2027 మార్చి నాటికి పంపిణీ చేయాలని తెలిపారు.

April 17, 2026 / 09:00 PM IST

తక్షణమే చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశాలు

కోనసీమ: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా ‘SP-Sampark’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. తమ వ్యక్తిగత, వృత్తి పరమైన సమస్యలను మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ ద్వారా ఎస్పీకి విన్నవించుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

April 17, 2026 / 09:00 PM IST

‘తప్పుదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి’

కృష్ణా: సోషల్ మీడియా వేదికగా అసత్య వార్తలు, మార్ఫింగ్ వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా మాజీ సీఎం జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

April 17, 2026 / 08:48 PM IST

శ్రీ అంకాల పరమేశ్వరి ఆలయంలో ఘనంగా అమావాస్య పూజలు

తిరుపతిలోని శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమావాస్య పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి శాస్త్రోక్తంగా విశేష అభిషేక సేవలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అందంగా అలంకరించి ఊరేగించారు. ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తిపాటలు, కోలాటాల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.

April 17, 2026 / 08:48 PM IST

అంధ బాలికల పాఠశాల తనిఖీ

VSP: సాగర్‌నగర్‌లోని అంధ బాలికల పాఠశాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి నాణ్యతను మెచ్చుకున్నారు. పరిశుభ్రత, బోధన ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయని తెలిపారు. చిన్నారుల సంగీత ప్రతిభకు ఆకర్షితులై ప్రత్యేకంగా మరొక రోజు వస్తానన్నారు. పూర్వ విద్యార్థుల విజయాలను ప్రశంసించారు.

April 17, 2026 / 08:47 PM IST