• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడే ఇంటర్ ఫలితాలు విడుదల

KRNL: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను నేడు (బుధవారం) విడుదల చేయనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తారు. విద్యార్థులు HIT TV యాప్ ద్వారా వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

April 15, 2026 / 08:47 AM IST

కాణిపాకంలో టీటీడీ ఏకసభ్య కమిటీ సభ్యుడు

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని మాజీ ఐఏఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏకసభ్య కమిటీ సభ్యుడు దినేశ్ కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ అందించారు.

April 15, 2026 / 08:31 AM IST

ప్రశాంతి నిలయంలో జేబీ కీర్తన గానకచేరి

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో తమిళ నూతన సంవత్సర వేడుకలు జేబీ కీర్తన భరద్వాజ్ బృందం కర్ణాటక సంగీత కచేరీతో ఘనంగా ముగిశాయి. ఆల్ ఇండియా రేడియో ఏ-గ్రేడ్ కళాకారిణి అయిన కీర్తన సంప్రదాయ దేవారం స్తోత్రాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘బ్రోచేవారెవరు’, ‘మోక్షము గలదా’ వంటి కీర్తనలను ఆమె శ్రావ్యంగా ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు.

April 15, 2026 / 08:30 AM IST

నెరవేరిన 70 ఏళ్ల కళ

CTR: పూతలపట్టు మండలం చవటపల్లి హరిజనవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దాదాపు 70 ఏళ్లుగా విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేశారు. విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు.

April 15, 2026 / 08:29 AM IST

చెరువులో గుర్తుతెలియని మహిళ మృతి

BPT: అమృతలూరు మండలం కూచిపూడి ఎల్‌జీ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి గుర్తింపుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 15, 2026 / 08:24 AM IST

నిబంధనలు ఉల్లంఘించిన వారికి అవగాహన

VZM: గుర్ల ఎస్సై నారాయణరావు ఆద్వర్యంలో స్థానిక పోలీసులు మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని జంక్షన్‌ వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు విధించారు. ఈ మేరకు ప్రజలకు ట్రాఫిక్‌ నియమాలు, సైబర్‌ నేరాలు, క్రికెట్‌ బెట్టింగ్‌, ప్రమాదాల నివారణ, తదితర అంశాలపై ఆవగాహన కల్పించామని ఎస్సై తెలిపారు.

April 15, 2026 / 08:20 AM IST

సెన్సస్-2027 విజయవంతం చేయాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో సెన్సస్-2027 నిర్వహణకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఆదేశించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరిగే స్వీయ నమోదులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రోజుకు కనీసం 10 నుంచి 20 మంది స్వీయ నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు స్పష్టం చేశారు.

April 15, 2026 / 08:18 AM IST

సోలార్ యూనిట్లతో పర్యావరణ పరిరక్షణ: ఎమ్మెల్యే

కోనసీమ: సోలార్ యూనిట్లు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. రామరాజులంకలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జ్యోతి యోజన పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఇళ్లపై సోలార్ రూఫ్ ఏర్పాటు వల్ల విద్యుత్ ఖర్చు ఆధా అవుతుందన్నారు.

April 15, 2026 / 08:03 AM IST

కాటసాని అవినీతికి ప్రతీక: మంత్రి

NDL: బనగానపల్లెలో జరిగిన మంగళవారం విలేకరుల సమావేశంలో ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడాన్ని సహించలేకే ఆయన విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కాటసాని అవినీతికి ప్రతీక అని మండిపడ్డారు. అభివృద్ధి పనులు దాతల సహకారంతో కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

April 15, 2026 / 07:53 AM IST

ANUలో లా సెట్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ప్రారంభం

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని న్యాయ అధ్యయన విభాగం లా సెట్ కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు విభాగాధిపతి విజయలక్ష్మి తెలిపారు. 5 ఏళ్ల LLB కోర్సు లక్ష్యంగా పెట్టుకున్న AP అభ్యర్థులకు రెండు వారాల ప్రత్యేక కోచింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్నవారు న్యాయ విభాగ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.

April 15, 2026 / 07:45 AM IST

గుంతకల్లులో బాలిక మిస్సింగ్.. కేసు నమోదు

ATP: గుంతకల్లు పట్టణంలోని మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు కుమార్తె ఎం.దీక్షిత(14) మిస్సింగ్‌పై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఇన్చార్జ్ సీఐ మనోహర్ తెలిపారు. సిఐ మాట్లాడుతూ.. దీక్షిత కనబడుటలేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. ఆచూకీ 9440796823, 94407968215కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

April 15, 2026 / 07:40 AM IST

నేడు పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక

KDP: పరిశ్రమలు నిర్వహించే పారిశ్రామిక వేత్తలు విద్యుత్ సమస్యలపై బుధవారం తమ కార్యాలయంలో నిర్వహించే పరిష్కార వేదికకు హాజరు కావొచ్చని APSPDCL సీఎండీ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. వినియోగదారులు నేరుగా కార్యక్రమానికి హాజరై సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.

April 15, 2026 / 07:40 AM IST

నేడు జీడీ నెల్లూరులో అన్న క్యాంటీన్ ప్రారంభం

CTR: జీడీ నెల్లూరు మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ను ప్రారంభిస్తున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు స్వామి దాస్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు డీసీసీ బ్యాంకు ఎదురుగా నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ను జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డా. థామస్ చేతులు మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ నాయకులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

April 15, 2026 / 07:40 AM IST

తిరుమలలో మోసం.. ఇద్దరు అరెస్ట్

TPT: సోషల్ మీడియా ద్వారా తిరుమలలో వీఐపీ దర్శనం, వసతి పేరుతో భక్తులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. Facebook, వాట్సప్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టి UPI ద్వారా డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు గుర్తించారు. నిందితులు చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన కామసాని పవన్ కుమార్ రెడ్డి, బొడిరెడ్డి చెన్నకేశవులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.

April 15, 2026 / 07:39 AM IST

సౌర విద్యుత్తుతో ఎన్నో ఉపయోగాలు

AKP: సౌర విద్యుత్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. సబ్బవరం సాయి నగర్ కాలనీలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలి యోజన కింద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ యూనిట్‌ను మంగళవారం ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. మిగులు విద్యుత్తును ఏపీఈపీడీసీఎల్ కు సరఫరా ద్వారా ఆదాయం కూడా వస్తుందన్నారు.

April 15, 2026 / 07:33 AM IST